హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ డిస్కమ్‌లు అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడానికి 24/7 శ్రమిస్తున్నాయని టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ అంతరాయాలు నాలుగైదుసార్లు జరుగుతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.