మోటర్లు తొలగించొద్దు.. పంటలు ఎండిపోతే చావే దిక్కు
సుద్దవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను పంటలకు వినియోగించొద్ద ని, మోటర్లు తొలగించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండ లం మాలేగాం సమీపంలో రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
- ప్రాజెక్టుకు భూములిస్తే నీళ్లియ్యరా?
- మాలేగాంలో సుద్దవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరీవాహక ప్రాంత రైతుల ధర్నా
కుభీర్, అక్టోబర్ 16 : సుద్దవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను పంటలకు వినియోగించొద్ద ని, మోటర్లు తొలగించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండ లం మాలేగాం సమీపంలో రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మాలేగాం, కుంభి, సాంవ్లి, న్యూ సాంవ్లి, నిగ్వ, మీర్జాపూర్ తదితర గ్రామాల రైతుల భూములు సుద్దవాగులో ముంపునకు గురయ్యాయి. మిగిలిన భూముల్లో రైతులు పసుపు, మిరప, పత్తి, కంది సాగుచేసుకున్నారు. సుద్దవాగులో రైతులు వేసిన మోటర్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై రైతులు ఆగ్రహంతో ఇలా రోడ్డెక్కారు. ప్రభుత్వం మొండివైఖరి వీడకుంటే కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
అధికారులు ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలి
పొలాలకు సమీపంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యామ్‌ల నుంచి మోటర్లు, ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తరలించవద్దంటూ అధికారులు ఇచ్చిన ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే వర్షాల్లేక సోయాబిన్ పంటకు నష్టమైంది. పత్తి చేలు సరిగా లేవు. ఈ దశలో ఆ చేలను కాపాడుకునేందుకు నీటిని వాడుకోవద్దనడం సరికాదు. మరో 15 రోజుల వరకు నీటి అవసరం ఉంటుంది. ఈ దశలో మా ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.
-బత్తుల అనిల్, రైతు, బజార్హత్నూర్, ఆదిలాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

