హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ‘థియరీ తక్కువ.. ప్రాక్టికల్స్ ఎక్కువ’ ఇది జర్మనీ విద్యావిధానం ప్రత్యేకత. ఆ దేశంలో మనలా పుస్తకాలతో నిరంతరం కుస్తీపట్టడం ఉండదు. సంబంధిత రంగంలో ఇంటర్న్షిప్ తప్పనిసరిగా చేస్తూ.. ఇండస్ట్రీలో పనిచేయాల్సిందే. ఇలాంటి ప్రత్యేకతలు గల జర్మనీ విద్యావిధానంపై ఇటీవల విద్యాశాఖ అధ్యయనం చేయించింది. 35 మందితో కూడిన బృందాన్ని జర్మనీకి పంపించింది.
ఈ బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో జూన్ 28 నుంచి ఈనెల 6 వరకు పర్యటించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలను సందర్శించి అధ్యయనం చేసింది. సోమవారం స్వదేశానికి చేరుకున్న ఈ బృందం నివేదికను రూపొందించే పనిలో నిమగ్నం అయింది.