Water leak | వర్షపు నీటిలో గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు.. మంచిర్యాల జిల్లాలో ఘటన : వీడియో
Water leak | కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్(Krishnapally ZP School) భవనంలో వర్షపు నీరు లీక్(Water leak) అవ్వడంతో విద్యార్థులు క్లాసు రూంలో గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్నారు. పుస్తాకాలు, పెన్నులు పట్టుకొని చదువాల్సిన విద్యార్థులు ఓ చేతితో పెన్ను మరో చేతితో గొడుగు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికి ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా శాఖ తన వద్దే ఉందని సదరు శాఖలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. కానీ, రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత, మౌలిక వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండా, వాన నుంచి కాపాడాల్సిన తరగతి గదే నీళ్లలో ముంచెత్తుతుండటంతో విద్యార్థులు గొడుగులు(Umbrellas) ఆసరగా చేసుకొని చదువువాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లాలో(Mancherial) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్(Krishnapally ZP School) భవనంలో వర్షపు నీరు లీక్(Water leak) అవ్వడంతో విద్యార్థులు క్లాసు రూంలో గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్నారు. పుస్తాకాలు, పెన్నులు పట్టుకొని చదువాల్సిన విద్యార్థులు ఓ చేతితో పెన్ను మరో చేతితో గొడుగు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
స్కూల్ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్.. గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు
మంచిర్యాల – కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు… pic.twitter.com/QdUfXHPuVz
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

