సీఎం వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల భగ్గు.. జాబ్ అప్లికేషన్లు నింపలేమనేవారు.. నామినేషన్ పత్రాలు నింపగలరా?
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించడం మానుకుని, ఇంజినీరింగ్ విద్యలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
- విమర్శలు మాని.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించడం మానుకుని, ఇంజినీరింగ్ విద్యలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అవుతుంటే రెండున్నరేండ్లు సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేశారు? లోపాలుంటే ఎందుకు సరిదిద్దలేదని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిశోధక విద్యార్థి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని హెచ్చరించారు. నైపుణ్యాల లోపాన్ని సవరించాల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటంపై విచారకరమని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దాఖలు చేసిన కోర్టు పిటిషన్లు, ఆర్టీఐ దరఖాస్తులు రేవంత్‌రెడ్డే స్వయంగా రాశారా? అని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కాదు.. రేవంత్‌రెడ్డే క్రిమినల్ వేస్ట్ అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ తానే రాశారా? అక్షర దోషం లేకుండా మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ, చీఫ్ మినిస్టర్ అని ఇంగ్లిష్‌లో రాయగలరా? అని ప్రశ్నించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో స్టార్టప్ హబ్‌గా ఉన్నదంటే అందుకు కారణం ఇంజినీరింగ్ విద్యార్థులే అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. మరోసారి ఇలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఇంజినీరింగ్ విద్యలో సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి విద్యార్థులపై నిందలేయడం సరికాదని దుర్గాప్రసాద్ అనే బీటెక్ విద్యార్థి పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాలు సంధించిన ప్రశ్నలు..
- ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అయితే.. మన విద్యార్థులకు అత్యధిక వేతన ప్యాకేజీలు ఎలా దక్కుతున్నాయి? జేఎన్టీయూ విద్యార్థి రూ.52లక్షల వార్షిక ప్యాకేజీ, సీబీఐటీలో రూ.54లక్షలు, వీఎన్నాఆర్ విజ్ఞాన జ్యోతిలో 64.3 లక్షలు, బీవీఆర్ఐటీలో రూ.52లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారా?
- క్రిమినల్ వేస్ట్ అవుతుంటే విద్యాశాఖ మంత్రిగా ఉండి రెండున్నరేండ్లు ఏం చేసినట్టు. ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలేవి?
- అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వలేదు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం వేధిస్తున్నాయి. హైకోర్టు పలు మార్లు మొట్టికాయలేసింది. అయినా బుద్ధి తెచ్చుకోకుండా విద్యార్థులను అవమానిస్తారా?
- రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫ్యాకల్టీ లేకుండా నడుస్తున్నాయి. ప్రిన్సిపాళ్లు లేని కాలేజీలున్నాయి. పలు కాలేజీలు ఫ్యాకల్టీకి జీతాలివ్వడంలేదు. ఈ కాలేజీలను ఎందుకు అదుపు చేయడం లేదు?
- సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో 214 సీట్లకు 56 సీట్లు మాత్రమే కేటాయించారు.
మిగతావి ఖాళీగా ఎందుకున్నాయి?
- జేఎన్టీయూ సహా కాన్స్టియంట్ కాలేజీల్లో 265(65శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 143 మంది టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయి. ఈ రెండున్నరేండ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదేం?
- కోర్ బ్రాంచీల్లో సీట్లను తగ్గిస్తూ. కాలేజీలు కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచుకుంటున్నాయి. సీఎస్ఈ సీట్లకు అనుమతినివ్వమని చెప్పి, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు. ఈ ఏడాది 7వేల సీట్లు ఎందుకు పెంచారు?
విద్యార్థులను కించపరచడం హేయం : ఏఐఎస్ఎఫ్
ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. దేశ, రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా సీఎం మాట్లాడటం అత్యంత హేయమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం వారు హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఒకవైపు వేదికలపై మాట్లాడేటప్పుడు జెన్-జీకి గౌరవం ఇవ్వాలని, వారి శక్తిసామర్థ్యాలను వినియోగించుకోవాలని చెప్తూనే, మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ పేర్కొనడం రేవంత్‌రెడ్డి ద్వంద్వనీతికి నిదర్శనమని మండిపడ్డారు.
సీఎం వ్యాఖ్యలపై ‘ఫతి’ ఖండన
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం వ్యాఖ్యలపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూట్స్(ఫతి) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఫతి చైర్మన్ ఎన్ రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, కోశాధికారి కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. మన విద్యార్థుల మేధస్సుతో ఐదు వేలకు పైగా కంపెనీలు, స్టార్టప్‌లు అవతరించాయని పేర్కొన్నారు. యువతను ప్రోత్సహించాల్సిందిపోయి, వారిని మానసికంగా దెబ్బతీయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
విద్యార్థులకు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి : సబిత
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యార్థిలోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాత్రింబవళ్లు శ్రమిస్తూ సాంకేతిక విజ్ఞానాన్ని సముపార్జిస్తున్న భావిభారత నిర్మాతలను ప్రోత్సహిస్తూ అభినందించాల్సిందిపోయి, అభాండాలు వేయడం సీఎం అహంకారానికి, అవివేకానికి నిదర్శమని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నైతిక విలువలను విస్మరించి అహంకారంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పకుంటే విద్యార్థిలోకం తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : కిషన్‌రెడ్డి
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని సీఎం రేవంత్‌రెడ్డి అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమని అడుగుతున్నారనే అక్కసుతో వారిని క్రిమినల్స్‌తో పోల్చడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిల్లో రూ.5వేల కోట్లు ఇంజినీరింగ్ విద్యార్థులకే చెల్లించాల్సి ఉన్నదని, ఈ బకాయిలు చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో సీఎం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

