BTech | బీటెక్ విద్యలో కొత్త పుంతలు.. ఇంజనీరింగ్‌లోనూ ఫైనాన్స్ కోర్సు తీసుకొచ్చిన విద్యాశాఖ
BTech | భిన్న కాంబినేషన్ల మేళవింపుతో బీటెక్ ప్రోగ్రాముల్లో సాంకేతిక విద్యను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంస్కరణలు, మల్టీ డిసిప్లినరీలో భాగంగా బీటెక్‌లోనూ ఫైనాన్స్ కోర్సును అంతర్భాగంగా చేర్చారు.
BTech | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): భిన్న కాంబినేషన్ల మేళవింపుతో బీటెక్ ప్రోగ్రాముల్లో సాంకేతిక విద్యను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంస్కరణలు, మల్టీ డిసిప్లినరీలో భాగంగా బీటెక్‌లోనూ ఫైనాన్స్ కోర్సును అంతర్భాగంగా చేర్చారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈ, బీ టెక్ ప్రోగ్రాముల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణ యం తీసుకున్నారు. దీంట్లో భాగంగా బీటెక్ స్పెషలైజేషన్‌ను మేజర్‌గా, ఫై నాన్షియల్ సర్వీసెస్‌ను మైనర్ కోర్సు గా విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. ఈ విద్యాసంవత్సరం లేదా వచ్చే ఏ డాది నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వస్తుంది. ఇటీవల బ్యాకింగ్ అం డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) రంగం హవా సాగుతున్నది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. దీంతో వి ద్యార్థులు వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. బీ కాం, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. ఈ దశలో డిగ్రీలో బీకాం కోర్సుకు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ ప్రోగ్రాముల్లో మార్పుల్లో భాగంగా విద్యాశాఖ బీటెక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సును కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
త్వరలో విధివిధినాల మీటింగ్
ప్రస్తుతానికి ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీల్లో మైనర్ కోర్సుగా ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ దిశలో విధివిధానాలు, పాఠ్యాంశాల రూపకల్పనకు ఇటీవలే వర్సిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల మొదటి వా రంలో మరో సమావేశం జరగనున్న ది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీకాం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దోస్త్ ద్వారా ఈ కోర్సును అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నారు.
అమలు తీరు ఇలా..
- బ్యాంకింగ్ రంగంలో పనిచేయాలన్న ఆసక్తి గల బీటెక్ వి ద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. బీటెక్ పట్టాతో పాటే మై నర్ కోర్సు పట్టా అందజేస్తారు.
- బీటెక్ ప్రోగ్రాముల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థులు మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్లో మైనర్‌గా ఫైనాన్షియల్ స ర్వీసెస్ కోర్సును తీసుకోవచ్చు. ఎనిమిదో సెమిస్టర్ లోగా ఈ కోర్సు పూర్తిచేయాలి.
- ఈ కోర్సులో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ, సీబీఐటీ వంటి అ టానమస్ కాలేజీల్లో తొలుత ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత జేఎన్టీయూ, ఓ యూ, కేయూ అనుబంధ కాలేజీలకు విస్తరిస్తారు.
- కోర్సు పాఠ్యాంశాలను బీఎఫ్ఎస్ఐ నిపుణుల సహకారంతో రూపొందిస్తారు. బోధన భిన్నం గా ఉంటుంది. వర్సిటీల కామ ర్స్ విభాగం ప్రొఫెసర్లతోపాటు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, పరిశ్రమల నిపుణులతో పాఠ్యాంశాలను బోధిస్తారు.
- ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ అకడమిక్ కౌన్సిల్ ఈ కోర్సుకు 18 క్రెడిట్లు జారీకి నిర్ణయించింది.
- కోర్సు బోధనలో ప్రాక్టికల్స్, థియరీ క్లాసులంటాయి. ఇంటర్న్‌షిప్ అమలుచేస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పనిచేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

