పాలమూరును వలస జిల్లాగా మార్చే కుట్ర
‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి.. కులవృత్తుల వారికి చేతినిండా పని కల్పించడంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు.. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో పాలమూరును మళ్లీ వలసలకు కేరాఫ్‌గా మార్చే కుట్ర జరుగుతున్నది.
- కృష్ణా జలాలు ఏపీకి ధారాదత్తం
- పీఆర్‌ఎల్‌ఐని పడావు పెట్టిన్రు
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- హన్వాడ, మహ్మదాబాద్‌లో పంటల పరిశీలించిన నేతలు
మహబూబ్‌నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి.. కులవృత్తుల వారికి చేతినిండా పని కల్పించడంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు.. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో పాలమూరును మళ్లీ వలసలకు కేరాఫ్‌గా మార్చే కుట్ర జరుగుతున్నది. మళ్లీ ముంబై, పుణె బస్సులు నడిపే రోజులు వస్తున్నాయి’ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లి, మహ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి గ్రామాల్లో ఎండిన పంటలను ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పంట లు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే.. ప్రభుత్వం రైతుమేళాలు నిర్వహిస్తుండటం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కరువు మండలాలను ప్రకటించి పరిహారం అందించాలని డిమాడ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

