Vedda Tribe | శ్రీలంక వేద్దా తెగలో భారతీయ మూలాలు: సీసీఎంబీ
శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న వేద్దా తెగ ప్రజల్లో భారతీయ మూలాలు ఉన్నట్టు సీసీఎంబీ, మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
- సీసీఎంబీ, మరో నాలుగు సంస్థల పరిశోధనలో వెల్లడి
Vedda Tribe | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న వేద్దా తెగ ప్రజల్లో భారతీయ మూలాలు ఉన్నట్టు సీసీఎంబీ, మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఐదు సంస్థ ల నుంచి పది మంది పరిశోధకులు శ్రీలంకలోని మైనార్టీ సమూహమైన వేద్దా జనాభా జన్యు చరిత్ర విషయాలను వెలుగులోకి తెచ్చారు. వీరిని స్థానికంగా వన్నియలేటోలుగా పిలుస్తారు. వేద్దా తెగ భాష, వ్యవహారికం, సాంస్కృతిక లక్షణాలు వైవిధ్యంగా ఉండటమే ఈ పరిశోధనకు కారణమని సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ కే తంగరాజ్ తెలిపారు.
ఈ తెగ భారతీయులతో గణనీయమైన జన్యు సంబంధాన్ని కలిగి ఉన్నట్టు తమ ఆటోసోమల్ విశ్లేషణలో తేలిందని బీహెచ్ యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే పేర్కొన్నారు. వీరిలో శ్రీలంకలోని సింహళీయులు, శ్రీలంక తమిళుల మూలాలు కూడా ఉన్నాయని కొలొంబో యూనివ ర్సిటీకి చెందిన రువాండీ రణసింగ్ చెప్పారు. ఈ పరిశోధన ద్వారా దక్షిణాసియా జనాభా చరిత్రపై మరిన్ని కోణాలు ఉంటాయని భావిస్తున్నారు. తమ పరిశోధన దక్షిణాసియావాసుల జన్యు వైవిధ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

