SpringSpree | వరంగల్ NIT లో మూడు రోజులు స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్.. పాల్గొననున్న బ్రహ్మానందం
SpringSpree | వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు.
హనుమకొండ చౌరస్తా : వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. సంగీతం, నృత్యం, కళలు, వినోదం వంటి రంగాల్లో ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
దేశంలోని ప్రముఖ కళాశాలల వార్షికోత్సవాల్లో ఒకటిగా వరంగల్ నిట్ పేరుగాంచింది. దేశవ్యాప్తంగా ఉన్న నిట్ కాలేజీల విద్యార్థులు ఈ మహోత్సవానికి హాజరవుతారని బిద్యాధర్ తెలిపారు. పోటీలు, వర్క్‌షాపులు, ప్రో షోలు, మ్యూజిక్ డీజేలు, బైక్ స్టంట్స్ లాంటి విభిన్న కార్యాక్రమాలు చేపట్టనున్నారు. అనేక కార్యక్రమాలతో స్ప్రింగ్ స్ర్పీ యువతలోని ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించనుంది.
ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించేందుకు ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన అమోఘమైన హాస్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న బ్రహ్మానందం స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్‌ను ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

