షూటింగ్ రేంజ్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మెరుపులు

హైదరాబాద్ : తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫక్తు రాజకీయ నేతని అందరం అనుకుంటాం..కానీ ఆయన బుధవారం సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టగానే ఓ రేంజ్లో చెలరేగారు. శ్రీనివాస్ గౌడ్ అలవోకగా .22 వాల్తర్ పిస్టల్‌ను అందుకుని ప్రొఫెషనల్ తరహాలో పలు షాట్స్‌ను ఫైర్ చేయడంతో ఒలింపిక్ మెడల్ విజేత, ఏస్ షూటర్ గగన్ నారంగ్ సహా అక్కడున్న వారంతా విస్తుపోయారు. పిస్టల్‌తోనే కాకుండా రైఫిల్, షాట్ గన్, ఎయిర్ రైఫిల్‌తో పది మీటర్ల రేంజ్లో సైతం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
మంత్రి చాలా ఉత్సాహంగా దూకుడుగా టార్గెట్స్‌ను ఢీకొట్టారని గగన్ నారంగ్ ఆశ్చర్యంతో చెప్పుకొచ్చారు. గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్‌లో శాట్స్ చీఫ్ ఏ వెంకటేశ్వర రెడ్డి, ఇతర క్రీడాకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ ఎక్స్పీరియన్స్ సెషన్ మంత్రి విన్యాసాలకు వేదికైంది. షూటింగ్ అంటే ఇప్పటికీ తనకు ఆసక్తి అధికమని, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)లో తాను లైఫ్ మెంబర్‌నని, తనకు లైసెన్డ్ గన్ ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
రెండు షూటింగ్ రేంజ్‌ల్లో రెండు గంటలకు పైగా కలియతిరిగిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి మరింత మంది గగన్ నారంగ్‌లు ఎదిగిరావాలని కోరుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్ నుంచి మరింత మంది షూటర్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాలని ఆకాంక్షించిన మంత్రి నగరంలోని షూటింగ్ రేంజ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ ఆదరణ పొందిన తరహాలోనే షూటింగ్‌కు ఆదరణ పెరిగేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇక రాష్ట్రంలో క్షేత్రస్ధాయి నుంచి షూటింగ్‌ను ప్రోత్సహిస్తామని గగన్ నారంగ్ పేర్కొన్నారు.
తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫక్తు రాజకీయ నేతని అందరం అనుకుంటాం..కానీ ఆయన బుధవారం సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టగానే ఓ రేంజ్లో చెలరేగారు.@VSrinivasGoud @trspartyonline pic.twitter.com/2Fj2xflk3z
— Namasthe Telangana (@ntdailyonline) July 21, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

