పేదలకు గూడు సీఎం కేసీఆర్ లక్ష్యం
రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకూ గూడు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
- డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో తెలంగాణ ఆదర్శం
- 780 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్
రుద్రూర్, జూలై 25: రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకూ గూడు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్, మోస్రా, చందూర్ మండలాల్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వర్ని మండలంలో 24 మందికి, కోటగిరి, పొతంగల్ మండలాల్లో 280 మందికి, రుద్రూర్ మండలంలో 191 మందికి, మోస్రా మండలంలో 105 మందికి, చందూర్ మండలంలో 180 మందికి కలిపి మొత్తం 780 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. మొదట బాన్సువాడ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ 1400 ఇండ్లు మంజూరు చేశారని, విడుతల వారీగా ఇండ్లు మంజూరు చేసుకొని ప్రస్తుతం 11 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించామని వివరించారు. కాంట్రాక్టర్ల ద్వారా కట్టించినవి 4 వేల ఇండ్లు, సొంత స్థలంలో కట్టుకున్న లబ్ధిదారులు 7 వేల మంది ఉన్నారని తెలిపారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం ప్రారంభమవుతుందని, ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకంలో 13 లక్షల మంది ఆడబిడ్డలకు సుమారు రూ.11 వేల కోట్లు అందజేసినట్టు వివరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో 14 వేల మందికి రూ.110 కోట్లు అందజేశారని, పేదలు తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు చేసుకోవడానికి 100 కల్యాణ వేదికలు నిర్మించి ఇచ్చామని పేర్కొన్నారు.
గూడు కల్పించిన దేవుడు
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు. గూడు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి ఆదుకున్నడు. పోచారం సారు అడిగిన వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించిండు.
-నీరడి రాజమణి, రుద్రూర్
ఇల్లు కట్టుకుంట అనుకోలే
నేను కలలో కూడా ఇల్లు కట్టుకుంట అనుకోలే. నేను, మా తమ్ముడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని అడిగిన వెంటనే ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు బిల్లు కూడా తీసుకున్న.
-గొర్ల కృష్ణ, రుద్రూర్
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సార్ నా కు ఇల్లు ఇచ్చి దేవుడయ్యా డు. ఊర్ల పెద్ద మనుషులు పోచారం సహకారంతో ఈ రోజు నాకు డబుల్ బెడ్ రూం బిల్లు ఇచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.
-బేగరి ఎర్ర సాయమ్మ, రుద్రూర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

