రాష్ట్రమంతా నైరుతి

హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఐదురోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఏపీలో కూడా రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి ఒడిశామీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని, పశ్చిమదిశగా బలమైన గాలులు రాష్ట్రంలోకి వస్తున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాగల నాలుగు రోజులు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనావేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని హెచ్చరించింది. గత 24 గంటల్లో వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు మినహా రాష్ట్రమంతా వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాకాల ప్రారంభంలోనే సాధారణం కంటే 123 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

