సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 8 సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న-సిరిసిల్ల, వరంగల్ అర్బన్ (హన్మకొండ) జిల్లాల సమీకృత కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాలను ప్రారంభించడానికి రోడ్లు భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయించుకోవాలన్న దృఢనిశ్చయంతో ఉన్నారు.