హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని గ్రీన్ బెల్ట్, రోడ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు, ప్రముఖ పర్యావరణ వేత్త ఎరిక్ సొల్హీమ్ ట్వీట్ చేశారు. కొరియాలోని సోలార్ రూఫ్ ట్రాక్‌ను తాను ట్వీట్ చేస్తే, మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో అద్భుతంగా నిర్మించారని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లోనే సైకిల్ ట్రాక్ ఔత్సాహిక సైక్లిస్టుల కోసం తెరుచుకోనున్నదని తెలిపారు. కొత్త సైకిల్ ట్రాక్‌పై ట్రయల్ చేయడం చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పారు. సూచన చేసిన మీరే స్వయంగా సైకిల్ ట్రాక్‌పై ట్రయల్ రన్‌గా సైకిల్ తొక్కడం చాలా ఆనందంగా ఉన్నదని తెలంగాణ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్వీట్ చేశారు.