కారణ జన్ముడు.. అభివృద్ధి సూరీడు
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం సామాజిక మాధ్యమాల్లో వెల్లివిరిసింది. వేలాది మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను గుర్తుచేసుకొన్నారు
సోషల్ మీడియాలో వెల్లివిరిసిన అభిమానం
హైదరాబాద్, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం సామాజిక మాధ్యమాల్లో వెల్లివిరిసింది. వేలాది మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను గుర్తుచేసుకొన్నారు. ట్వీట్ల ద్వారా, ఫేస్బుక్లో పోస్టుల ద్వారా ఆయనను దీవించారు. ఆయన మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. బుధవారం సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు చేసిన ట్వీట్లలో కొన్ని…
రాష్ట్రం కోసం రగిలిన రణధీరుడు
దేశం కోసం గర్జిస్తున్న రాజనీతిజ్ఞుడు
ఆయన మాట కోసం భరోసా కోసం
యావత్ దేశం ఎదురుచూస్తున్నది.
జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.
పల్లెబాటల్లో పోరునగధీరుడు
పల్లె ప్రగతి.. విరాజిల్లు ప్రియ పరిపాలకుడు.
కారణజన్ముడికి జన్మదిన శుభాకాంక్షలు.
మీ జననం తెలంగాణ ఉద్యమం
మీ ఉద్యమం తెలంగాణ స్వాతంత్య్రం
మీ స్వప్నం కోటి ఎకరాల మాగాణం,
బంగారు తెలంగాణం
కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రపంచాన్ని జయించే మేధోసంపత్తి
రాజకీయ ముఖచిత్రం మార్చే సమతా స్ఫూర్తి
ప్రజా క్షేమాన్ని కాంక్షించే మానవ మూర్తి
యుగానికొక్కడు. రైతు బాంధవుడు. అపర భగీరథుడు. అభివృద్ధి సూరీడు. సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

