హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థుల కోసం రూపొందించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2022 పుస్తకాలు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని రాష్ట్ర ప్రణాళిక విభాగం సంచాలకులు ఎస్కే మీరా తెలిపారు. గ్రూప్-1తో పాటు ఇతర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే ఈ స్టడీ మెటీరియల్‌ను రూ.150కే విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని గణాంకభవన్‌లో, అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో పుస్తకం అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు. పుస్తకానికి సంబంధించిన వివరాలకు రాష్ట్ర గణాంక విభాగం అధికారి జగన్ (91826 07890), ఉపగణాంక అధికారి శ్రీనివాస్ (89789 00832) సంప్రదించాలని పేర్కొన్నారు.