ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ గాలిలో ఎగిరే కార్ల కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. క్లెయిన్ విజన్ సంస్థ తయారు చేసిన ఎగిరే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ ఐరోపా దేశం స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. రెండు నిమిషాల్లో గాల్లోకి ఎగురుతూ.. 8 వేల అడుగుల ఎత్తులో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ ఎగిరే కారు ప్రయాణిస్తుందని తయారీదారులు తెలిపారు.