చిన్నారిని బలిగొన్న కూలర్
కూలర్‌ను ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేండ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉండే సౌందర్య, మనీష్ దంపతులు.
ఆర్మూర్‌టౌన్, జూన్ 7: కూలర్‌ను ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేండ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉండే సౌందర్య, మనీష్ దంపతులు. వీరు ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
వీరికి మధుర, సింధూర (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు పనిమీద ఊరెళ్తూ తమ కుమార్తెలను గురువారం ఆలూర్లోని అమ్మమ్మ లావణ్య వద్ద వదిలివెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న సింధూర ఇనుప కూలర్‌ను తాకింది. విద్యుత్తు సరఫరా కావడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. బంధువులు వెంటనే పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలావుండగా 15 రోజుల క్రితం ఆర్మూర్‌లో కూలర్ షాక్‌తో ఓ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

