ఎంపీలో ఆరుగురి కాల్చివేత
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
- పాత కక్షలతో ఒకే కుటుంబానికి చెందిన వారిపై దాడి, హత్య
- పలువురికి గాయాలు
భోపాల్, మే 5: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. మొరెనా జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేప గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ మధ్య చెత్త డంపింగ్‌కు సంబంధించి 2013 నుంచి వివాదం ఉంది. అ సందర్భంగా జరిగిన ఘర్షణలో ధీర్సింగ్ కుటుంబాన్ని హత్య చేసిన గజేంద్ర సింగ్ కుటుంబం గ్రామం నుంచి పారిపోయింది. తర్వాత ఈ వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కోర్టు బయట ఒప్పందం జరిగింది. దీంతో గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అయితే గతంలో తమవారిని హత్యచేసిన వారిని ఎలాగన్నా చంపాలని ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ధీర్ సింగ్ కుటుంబానికి చెందిన వారు వారిపై తుపాకులు, కర్రలతో దాడి చేశారు. వారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కాల్చి చంపారు. మరణించిన వారిలో గజేంద్ర సింగ్, అతని ఇద్దరు కుమారులు సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను హతమార్చాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Madhya Pradesh
- Morena
- shot
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

