హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంబాగ్ చెరువు బఫర్ జోన్లో లేక్‌వ్యూ విల్లాస్ పేరిట అక్రమంగా నిర్మించిన ఆరు విల్లాలను హెచ్ఎండీఏ-మణికొండ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.