అయిజలో విషాదం.. గోడ కూలి ఐదుగురు మృతి
అయిజ | జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున మిద్దె కూలీ ఐదుగురు సజీవ సమాధి

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున గోడ కూలి ఐదుగురు మృతిచెందారు. గ్రామానికి చెందిన మోష శనివారం రాత్రి తన భార్య, ఐదుగురు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గుడిసె గోడ కూలింది. దీంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతిచెందినవారిలో మోష, మోష భార్య శాంతమ్మ, కుమారులు చరణ్, తేజ, రాము ఉన్నారని, స్నేహ, చిన్ని గాయపడ్డారని తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు చెప్పారు. ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- aiza
- Jogulamba Gadwal
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

