‘సర్’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇ వ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 లక్షల నోటీసులు మాత్రమే సిద్ధమయ్యాయి. వాటిలో కేవలం 650 మందికే నోటీసులు అందినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.
- ఇప్పటివరకు 650 మందికే అందజేసిన అధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా 92.8 లక్షల మందికి నోటీసుల ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్న సీఈసీ
హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇ వ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 లక్షల నోటీసులు మాత్రమే సిద్ధమయ్యాయి. వాటిలో కేవలం 650 మందికే నోటీసులు అందినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. మరో రెండు రోజుల్లో పంపిణీ వేగం పుంజుకుంటుంద ని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తోపాటు చాలా ప్రాంతాల్లో నోటీసుల పం పిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ‘సర్’లో భాగంగా ఈ నెల 17న ముసాయిదా ఓట ర్ల జాబితా ప్రచురించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని గుర్తించారు.
వీరిలో 60.5లక్షల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్‌లో వివిధ రకాల అసమానతలు ఉ న్నట్టు గుర్తించారు. మరో 32.3 లక్షల మంది ఓటర్ల వివరాలను 2002నాటి ‘సర్’ జాబితాతో మ్యాప్ చేయలేకపోయినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 12.5 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉన్న ది. వీరిలో 5,80,908 మంది ఓటర్ల వివరాలు 2002 ‘సర్’ జాబితాతో మ్యాప్ కాలేదు. మరో 6,72,678 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్‌లో అసమానతలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 23.26 లక్షల మంది ఓటర్లను అన్మ్యాప్డ్ గా గుర్తించడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది. నోటీసుల భాష విషయంలోనూ స్పష్టతకు అధికారులు చర్యలు చేపట్టారు.
అసమానతలు ఉంటే నోటీసులు
ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్‌లో నమోదైన వివరాల్లో అనుమానాస్పద లేదా అసాధారణమైన తేడాలు కనిపిస్తే అనామలిస్ నోటీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యం గా కుటుంబసభ్యుల మధ్య వయస్సు వ్యత్యాసాలు అసాధారణంగా ఉండటం, తోబుట్టువుల మధ్య తొమ్మిది నెలల కంటే తకువ వ్యవధి ఉండటం, తల్లిదండ్రులు-పిల్లల మధ్య 15 ఏండ్ల కంటే తకువ లేదా 50 ఏండ్ల కంటే ఎకువ వయస్సు వ్యత్యాసం ఉండటం, తాత-మనుమమం డ్ల మధ్య 40ఏండ్ల కంటే తకువ వయస్సు తేడా ఉండటం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. 2002 నాటి ‘సర్’ ఓటర్ల జాబితాలోని వివరాలతో ప్రస్తుత ఎన్యుమరేషన్ ఫామ్‌లోని సమాచారం సరిపోకపోయినా నోటీసులిస్తున్నారు. తల్లిదండ్రుల పేర్లలో తేడా, బంధుత్వ వివరాల్లో మా ర్పు, ఒకే ఓటరుకు వేర్వేరు తం డ్రుల పేర్లు నమోదై ఉండటం, వయస్సు లో అసమానతలు, పేర్లు లేదా కుటుంబ సంబంధాల్లో వ్యత్యాసాలు వంటి అంశాలు కూడా నోటీసులకు కారణమవుతున్నాయి.
గడువులోపు పూర్తయ్యేనా?
నోటీసులు, క్లెయిమ్స్, అబ్జెక్షన్ల పరిష్కారానికి అక్టోబర్ 15వ తేదీ గడువుగా ప్రకటించారు. అయితే, ఈలోపు 92.8 లక్షల మంది ఓటర్లకు నోటీసుల జారీ, పరిష్కారం సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

