Epuri Somanna | బీఆర్ఎస్లోకి ఏపూరి సోమన్న.. తెలంగాణకు ప్రత్యామ్నాయం, పర్యాయ పదం కేసీఆరే!
Epuri Somanna | ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ల సమక్షంలో ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు
Epuri Somanna | హైదరాబాద్: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ల సమక్షంలో ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఇరువురూ పరస్పర క్షేమసమాచారాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను త్వరలో పార్టీలో చేరనున్నట్టు ఏపూరి సోమన్న ప్రకటించారు. ప్రజాగాయకుడిగా, ప్రత్యేక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి సోమన్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ అభివృద్ధిలో తానూ భాగస్వామ్యం కావాలని సోమన్న నిర్ణయించుకోవటం శుభపరిణామం అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సందర్భం వచ్చినపుడు తెలంగాణ శక్తులన్నీ ఏకం అవుతాయని చెప్పటానికి ఏపూరి సోమన్న గొప్ప ఉదహరణ అని తెలిపారు.
గుంపులు, గ్రూపులతో తెలంగాణకు తీవ్రనష్టం కలుగుతుందని భావించే తాను బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నానని ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణకు ప్రత్యామ్నాయం.. పర్యాయపదం సీఎం కేసీఆరేనని, అది తన అనుభవం తేల్చిన సత్యమని తెగేసి చెప్పారు. ఇదే తాను బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణమని అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఏపూరి సోమన్న అటు రాజకీయాల్లో.. ఇటు సాంస్కృతిక కళా రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు కుడిభుజంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతాల్లో ఆమె రాజకీయాలు చేయటానికి మార్గదర్శనం చేసిన వారిలో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనతోనూ కొంతకాలం ప్రయాణించారు. తెలంగాణ ఉద్యమంలో గళగర్జన చేసిన కళాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉద్యమంలో, ఉద్యమానంతర సమయంలోనూ తెలంగాణ అంతటా నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజాకళాకారుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

