‘సింగరేణి సైరన్’లో ముచ్చట్లు ప్రారంభం

- డైరెక్టర్ బలరామ్‌తో ప్రజాకవి
- జయరాజ్ ముఖాముఖి ప్రసారం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సింగరేణి ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన యూ ట్యూబ్ చానెల్ సింగరేణి సైరన్‌లో సింగరేణి ముచ్చట్లు కార్యక్రమం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరామ్‌తో ప్రజాకవి జయరాజ్ ముఖాముఖి నిర్వహించారు. సింగరేణీయులు అందరూ సింగరేణి సైరన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని ముఖ్య ప్రజా సంబంధా ల అధికారి, మారెటింగ్, కో ఆర్డినేషన్ జీఎం సూర్యనారాయణ సూచించారు. త్వరలో డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణరా వు, మైనింగ్ అడ్వైజర్ డీఎం ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులతో ముఖాముఖి ప్రసారం కానుందని చెప్పారు. మధుర జ్ఞాపకాల పేరిట 130 ఏండ్ల నుంచి సింగరేణిలో జరిగిన ప్రముఖ ఘట్టాలు, పరిణామ క్రమాలను పాతతరం ప్రముఖులు పంచుకునేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

