వేములవాడ రాజన్నకు శ్రావణ శోభ

వేములవాడ టౌన్, ఆగస్టు 9: శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. రాజన్నను దాదాపు 40 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని, సుమారు రూ.23 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
రాజన్నకు భారీగా వెండి కానుకలు
రాజన్నకు పెద్దమొత్తంలో వెండి కానుకలు సమకూరుతున్నాయి. 3 టన్నుల 600 కిలోల వెండి నిల్వలు ఉండగా, 1989 నాటికి సమకూరిన 400 కిలోల వెండిని అప్పటి శ్రీశైల దేవస్థానానికి విక్రయించారు. దాదాపుగా 32ఏళ్లుగా సమకూరుతున్న వెండి నిల్వలు ఆలయ అధికారులు బ్యాంకు లాకర్లలో నిల్వ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి మింట్‌లో ఇప్పటికే 8 క్వింటాళ్ల 60 కిలోల వెండి శుద్ధి కోసం అందజేశారు. ఇప్పుడు మరో 7 క్వింటాళ్ల 53 కిలోల 330 గ్రాముల వెండిని శుద్ధిచేసేందుకు ఆలయ అధికారులకు అనుమతి ఇచ్చారు. ఇంకా సుమారు 25 కోట్ల విలువచేసే వెండి స్వామివారి ఖజానాలో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- shravanam
- vemulawada
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

