నేటి నుంచి యాదగిరిగుట్టలో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార ఈశాన్య మండపంలో విష్వక్సేనారాధన, స్వస్తీవాచనంతో ఉత్సవాలను ప్రారంభిస్తారు
- 30 రోజులపాటు నిర్వహణ
యాదాద్రి, జూలై 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార ఈశాన్య మండపంలో విష్వక్సేనారాధన, స్వస్తీవాచనంతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రధానాలయంలోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించిన తర్వాత మొదటిసారిగా వస్తున్న శ్రావణమాసంలో జరిగే ఈ వేడుకను అత్యంత వైభవంగా చేపట్టనున్నారు.
భక్తులందరికీ చేరువ కావాలని, అభయం ఇవ్వాలన్న సంకల్పంతో లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేస్తారు. మొదటి రోజు పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తామని ఈవో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

