విదేశీ తరహా ఆధునిక టెక్నాలజీ వినియోగంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో విమానయాన సేవలు అందిస్తున్న జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టు తాజాగా టెక్నాలజీ ఆధారిత యంత్రాన్ని ప్రయాణికులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఉన్న సేవలు, ప్రత్యేక మార్గాలను చూపించే మోడ్రన్ మ్యాపింగ్ తో కూడిన ఈ ట్రాలీలు ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
– హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ