మురుగు నీటిపై నిరంతర నిఘా
మురుగునీటి ద్వారా ప్రబలే వివిధ రకాల వ్యాధులను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాశ్వత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
- వ్యాధులను గుర్తించేందుకు సీవరేజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్
- వివిధ సంస్థలతో కలిసి అందుబాటులోకి తెచ్చిన సీసీఎంబీ
- దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో అమలుకు సన్నాహాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మురుగునీటి ద్వారా ప్రబలే వివిధ రకాల వ్యాధులను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాశ్వత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ సమయంలో హైదరాబాద్‌లోని మురుగునీటిని పరిశీలించి వైరస్ తీవ్రతను గుర్తించిన సీసీఎంబీ పరిశోధకులు జాతీయ స్థాయిలోని పలు పరిశోధన సంస్థలతో కలిసి సీవరేజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో సీసీఎంబీతోపాటు ఐఐసీటీ, ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ లాంటి సంస్థలు ముఖ్యపాత్ర పోషించాయి. హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని ముంబై, జల్నా, కోల్‌కతా, చెన్నై తదితర నగరాలతోపాటు పలు పట్టణాల్లో ఈ విధానం అద్భుత ఫలితాలను ఇచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ క్రంటోల్ అండ్ ప్రివెన్షన్ లాంటి సంస్థలు ఇప్పటికే ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు చేయనున్నారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి మురుగునీటిని సేకరించి పీసీఆర్, ఆర్టీపీసీఆర్, క్యూఆర్టీ పీసీఆర్ లాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధి కారక జీవుల ఉనికిని తెలుసుకుంటారు. కొత్తగా వ్యాప్తి చెందే వ్యాధులను త్వరగా పసిగట్టి, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టేందుకు ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
తొలుత పోలియో ట్రాకింగ్
మురుగునీటిని పరీక్షించి వ్యాధికారకాలను గుర్తించడం పాత విధానమే. మన దేశంలో తొలుత పోలియో వైరస్‌ను ట్రాక్ చేసేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత ఇదే విధానాన్ని అనుసరించి కరోనా వైరస్ తీవ్రతను గుర్తించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన సీవరేజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌తో మరెన్నో కొత్త వ్యాధులను గుర్తించే వీలు ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

