Ramachandra Reddy | మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి, సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోటురావడంతో తుదిశ్వాస విడిచారు.
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోటురావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తలమడుగు మండలం కోదడ్. అక్కడే శుక్రవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన ఆదిలాబాద్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రామచంద్రారెడ్డి ఆదర్శ రాజకీయాలతో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్భంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

