సర్కారు అణచివేతలను ఆపండి.. గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ వినతి
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓయూలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, జర్నలిస్టులపై జరుగుతున్న వరుస దాడులను ఆయన గవర్నర్‌కు రాసిన లేఖలో ఉదహరించారు.
ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సాధన పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు అణచివేతకు పాల్పడుతున్నారని ఉదహరించారు. ప్రజాస్వామిక హకుల ఉల్లంఘనలో రాష్ట్ర ప్రభుత్వం పోటీపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వి
ద్యార్థుల శాంతియుత నిరసనలను, నిరాహార దీక్షలపై ప్రభుత్వం స్పందించకపోగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. వరుస ఘటనలపై జోక్యం చేసుకొని బాధిత సమాజంతో సర్కారు చర్చలు జరిపి వాటిని పరిష్కరించేలా మార్గదర్శనం చేయాలని దాసోజు శ్రవణ్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

