SCR Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నంబర్ తిరుపతి - షిర్డీ సాయినగర్ (రైలు నంబర్ 07637) రైలును సెప్టెంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం నడువనున్నది. అలాగే షిర్డీ సాయినగర్ - తిరుపతి (07638) రైలును సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నంబర్ తిరుపతి – షిర్డీ సాయినగర్ (రైలు నంబర్ 07637) రైలును సెప్టెంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం నడువనున్నది. అలాగే షిర్డీ సాయినగర్ – తిరుపతి (07638) రైలును సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నది. కాజీపేట – దాదర్ (07195) రైలు సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం పరుగులు తీయనున్నది. దాదర్ – కాజీపేట (07195) రైలు ప్రతి శనివారం నడువనుండగా.. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. కాజీపేట – దాదర్ (07197) వీక్లీ రైలు సెప్టెంబర్ 2-30 వరకు ప్రతి శనివారం నడువనున్నది. అలాగే దాదర్ – కాజీపేట (07198) మధ్య ఆదివారం అందుబాటులో ఉండనుండగా.. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పొడిగించింది.
అలాగే హైదరాబాద్ – రక్సౌల్ (07051) మధ్య ప్రతి శనివారం రైలు నడువనుండగా.. సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు, రక్సౌల్ – హైదరాబాద్ రైలు ప్రతి మంగళవారం సెప్టెంబర్ 5-అక్టోబర్ 3 వరకు నడువనున్నది. సికింద్రాబాద్ – దానాపూర్ (07419) మధ్య శనివారం 2 నుంచి 30 వరకు, దానాపూర్ – సికింద్రాబాద్ (07420) మధ్య ప్రతి సోమవారం సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు రైలు పరుగులు తీయనున్నది. సికింద్రాబాద్ – రక్సౌల్ (07007) మధ్య ప్రతి బుధవారం 6 నుంచి 27 వరకు.. రక్సౌల్ – సికింద్రాబాద్ మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్ 8 నుంచి 29 వరకు పొడిగించింది. సికింద్రాబాద్ – జైపూర్ (07115) మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29, జైపూర్ – హైదరాబాద్ (07116) మధ్య ప్రతి ఆదివారం సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే కాచిగూడ – బికనీర్ (07053) మధ్య ప్రతి శనివారం సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ వరకు, బికనీర్-కాచిగూడ (07054) మధ్య ప్రతి మంగళవారం సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రత్యేక రైలును పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Special Trains List
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

