Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాజీపేట-తిరుపతి (07253) రైలు ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి-కాజీపేట (07254) రైలు ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లు..
శుక్రవారం సాయంత్రం నుంచి ఇక చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్ మధ్య 36 ప్రత్యే క సర్వీసులను నడుపుతున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది. చర్లపల్లి-కాకికినాడ టౌన్ (07031) ప్రత్యేక రైలు మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుందని, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్ 29 వరకు పత్రి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమంత్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
చర్లపల్లి-నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లవల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. రెండు మార్గాల్లో రైలు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

