గ్రహాల పుట్టుక గుట్టు తెలిసింది!
గ్రహాలు ఎలా పుట్టాయి? నక్షత్రాలు ఎలా జన్మించాయి? లాంటి ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటికి సమాధానాన్ని వెతికే బాధ్యతను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసుకొన్నది.
- జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో కనిపెట్టిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: గ్రహాలు ఎలా పుట్టాయి? నక్షత్రాలు ఎలా జన్మించాయి? లాంటి ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటికి సమాధానాన్ని వెతికే బాధ్యతను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసుకొన్నది. మన సౌరకుటుంబం ఉన్న పాలపుంత సమీపంలో గ్రహాలు ఎలా ఏర్పడతాయో కనిపెట్టింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఎన్జీసీ 346 అనే చైతన్యవంతమైన నక్షత్ర ఉత్పత్తి ప్రాంతంపై దృష్టి పెట్టారు. తక్కువ బరువు గల నక్షత్ర ఏర్పాటును అర్థం చేసుకోవడం ద్వారా సౌర వ్యవస్థ ఏర్పాటును అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఈ తరహా నక్షత్రాలు ఏర్పడేటప్పుడు అవి చాలా మొత్తంలో ధూళిని వెలువరిస్తాయి. ఈ దృశ్యాన్ని మామూలు కెమెరాతో చిత్రీకరించడం అసాధ్యం. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కెమెరా ఈ సమస్యను అధిగమించింది. దీని ద్వారా గ్రహం ఏర్పాటును కూడా శాస్త్రవేత్తలు పరిశీలించవచ్చు. ఎన్జీసీ 346లో గ్రహాల పుట్టుకకు అవసరమైన పదార్థాలు శాస్త్రవేత్తలు గుర్తించడంతో వాటి ఉనికి అర్థం చేసుకోవడం మరింత విస్తృతమైందని నాసా డిప్యూటీ శాస్త్రవేత్త స్టీఫనీ మిలమ్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

