బడులు నడిచేది 166 రోజులే!

- దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు
- విద్యాక్యాలెండర్ రూపొందించిన ఎస్సీఈఆర్టీ
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో 1- 10వ తరగతి విద్యార్థులకు 166 రోజులపాటు పాఠశాలలు నడుపనున్నారు. ఈ మేరకు 2021-22 సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ అధికారులు తయారుచేశారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) అధికారులు ఈ క్యాలెండర్ రూపొందించారు. ఆమోదం కోసం దానిని ఉన్నతాధికారులకు పంపించారు. విద్యాసంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలు గడిచిపోవడంతో ఈ ఏడాది దసరా, సంక్రాంతి పండుగల సెలవులను కుదించనున్నారు.
అన్ని రకాల పరీక్షలు..
కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలిస్తే ఎస్సెస్సీ విద్యార్థులకు మార్చి, ఏప్రిల్ మాసాల్లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను సైతం నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

