SB Organics | ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు.. ఆరుకు చేరిన మృతులు
సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పరిశ్రమ డైరెక్టర్ రవితోపాటు కార్మికులు నలుగురు దుర్మరణం చెందారు. తాజాగా మరో కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద మరో కార్మికుడిని పోలీసులు గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్గా గుర్తించారు. ఘటనా స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారని గాలిస్తున్నారు. కాగా, మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
బుధవారం సాయంత్ర జరిగిన ఘోర ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఘటన జరిగినప్పినప్పుడు పరిశ్రమలో దాదాపు 60 మంది ఉండగా, దాదాపు 15 మంది కార్మికులు బాయిలర్ వద్దే పనిచేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమ లో బాయిలర్ పేలిన శబ్దం పది కిలోమీటర్ల మేర వినిపించింది. దట్టమైన పొగలు, మం టలు వ్యాపించాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని పలు పరిశ్రమల్లో కూడా ఆస్తినష్టం సంభవించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

