సట్టున్నోళ్లకే సుట్టెక్కువ.. పెరుగుతున్న సంపాదన.. బరువు
- మహిళల్లో ఊబకాయులు 30 %
- దక్షిణాదిలో మెరుగ్గా తెలంగాణ
- హైదరాబాద్ నగర మహిళల్లో సగం మంది ఊబకాయులే
- కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘సట్టున్నోళ్లకే సుట్టెక్కువ’ అన్నది తెలంగాణలో ఒక నానుడి. ‘సట్టు’ అంటే సం పద, ‘సుట్టు’ అంటే చుట్టుకొలత. అంటే.. డబ్బుతోపాటే సుఖం పెరుగుతుందని (శారీరక శ్రమ తగ్గడం), బరువు పెరుగుతారని దీని అర్థం. తాజా గణాంకాలు, విశ్లేషణలు సైతం ఇదే చెప్తున్నాయి. దక్షిణాది రాష్ర్టాల మహిళల్లో అధిక బరువు/ఊబకాయంపై కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) సంస్థ తాజాగా నివేదిక రూపొందించింది.
‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21)’ నివేదికను విశ్లేషిస్తూ సీఎస్డీ రూపొందించిన నివేదికను గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం తెలంగాణలో 30.1 శాతం మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. పురుషుల్లో కాస్త ఎక్కువగా 30.9 శాతం మంది ఊబకాయులు ఉన్నారు. దక్షిణాదిలో అత్యధిక శాతం మంది మహిళలు, పురుష ఉబకాయులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు, కేరళ, ఏపీల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అధిక బరువుతో బాధపడుతున్నారు.

తక్కువ.. ఎక్కువ.. టాప్ జిల్లాలు మనవే
దక్షిణాది రాష్ర్టాల్లో జిల్లాల పరంగా చూసినప్పుడు ఊబకాయులు అత్యధికంగా, అత్యల్పంగా ఉన్న జిల్లాలు తెలంగాణవే కావడం వి శేషం. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 అధ్యయనం సమయానికి ఐదు రాష్ర్టాల్లో కలిపి 120 జిల్లాలు న్నాయి. ఇందులో అతి తక్కువ ఊబకాయ మ హిళలు ఉన్న జిల్లాలుగా కుమ్రంభీం ఆసిఫాబా ద్, ఆదిలాబాద్ టాప్‌లో నిలిచాయి. ఆయా జి ల్లాల్లో వరుసగా 14 శాతం, 15.7 శాతం మందే అధిక బరువుతో బాధపడుతున్నారు. కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
- అత్యధిక శాతం మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్న జిల్లాగా తమిళనాడులోని కన్యాకుమారి నిలిచింది. ఆ జిల్లాలో ఏకంగా 53 శాతం మంది మహిళలు ఎక్కువ బరువుతో ఉన్నారట.
- రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రాష్ట్ర రాజధానిలో ఏకంగా 51 శాతం మంది మహిళలు ఊబకాయులని నివేదిక పేర్కొన్నది.
డబ్బు.. బరువు.. జంట ప్రయాణం
● జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4, 5 మధ్య పోల్చినప్పుడు దక్షిణాది రాష్ట్రా ల్లో తెలంగాణలోనే మహిళా ఊబకాయుల సంఖ్య తక్కువగా పెరిగింది. అత్యధికంగా తమిళనాడులో 9.5 శాతం మంది ఉబకాయులు పెరిగారు. కర్ణాటకలో 6.9 శాతం, కేరళలో 5.7 శాతం, ఏపీలో 2.9 శాతం పెరిగారు. తెలంగాణ 2 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఎన్ఎఫ్హెచ్ఎస్–4లో 28.1 శాతం మందికి ఉబకాయం ఉండగా, తాజాగా అది 30.1 శాతానికి పెరిగింది.
● అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోని మహిళలే అధిక బరువు కలిగిఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే తెలంగాణలోనే తక్కువ మంది ఉండటం విశేషం. తెలంగాణలో 23.8 శాతం మంది గ్రామీణ మహిళలు అధిక బరువుతో ఉండగా, కేరళ 36 శాతం, తమిళనాడు 35.4 శాతం, పాండిచ్చేరి 32.6 శాతం, కర్ణాటక 25.6 శాతంగా ఉన్నది.
● సామాజిక వర్గాల పరంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్టీల్లోనే ఊబకాయులు తక్కువగా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

