నిడమనూరు గురుకులంలో అరాచక పర్వం
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న నిడమనూరు మండలానికి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.
- బాలికల పట్ల పారిశుద్ధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన
- కొంతకాలంగా కొనసాగుతున్న వ్యవహారం
- ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థినుల తల్లిదండ్రులు
- ఆపై పోలీసులకు ఫిర్యాదు.. విచారణకు కలెక్టర్ ఆదేశం
- నిందితుడిని అరెస్ట్ చేసిన కనగల్ పోలీసులు
నల్లగొండ సిటీ, నవంబర్ 10 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న నిడమనూరు మండలానికి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోని పారిశుద్ధ్య కార్మికుడు బాలికల పట్ల కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదే విషయమై మంగళవారం విద్యార్థినుల తల్లిదండ్రుల ప్రిన్సిపాల్‌ను నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో దినేశ్ అనే వ్యక్తి తాత్కాలిక ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు.
ఇతడు కొంతకాలంగా విద్యార్థులను తాకరాని చోట తాకుతూ, బాత్రూమ్లోకి లాకెళ్లి తలుపులు వేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయాన్ని విద్యార్థినులు ఐదు నెలల క్రితం ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ సదరు కార్మికుడిని హెచ్చరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. కాగా విద్యార్థినులు దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారి తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ దృష్టి వెళ్లగా వారి ఆదేశాల మేరకు ఆర్డీవో అశోక్‌రెడ్డి, కనగల్ సీఐ రాము పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కార్మికుడి దినేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ తెలిపారు.
విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన..
నిందితుడు దినేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కనగల్‌లోని సాగర్ రహదారిపై ఆందోళనకు దిగారు. జిల్లా విద్యాశాఖ, పోలీస్ అధికారులు ఈ ఘటనపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వ నిర్లక్ష్యం వల్లే గురుకులాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

