Lift Irrigation | ఎత్తిపోతలకు ఏవీ కరెంటు లెక్కలు?.. ఇప్పటికీ దృష్టిసారించని సర్కారు
రాష్ట్రంలో సాగునీటి పారుదలశాఖకు సంబంధించి ఎత్తిపోత పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు విద్యుత్తు అవసరం ఉంటుంది? ఏ సమయాల్లో అవసరం ఉంటుంది? తదితర అంశాల్లో ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దాదాపు చాలావరకు మేజర్ సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల మీదే ఆధారపడి ఉన్నాయి.
- కావాల్సిన విద్యుత్తుపై అంచనాలు నిల్
- గత ఏడాది వరకు ఇప్పటికే ప్రతిపాదనలు
- అవసరమయ్యే విద్యుత్తుపై ఏటా లెక్కలు
- విద్యుత్తు సంస్థలకు ముందే ప్రతిపాదనలు
Lift Irrigation | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి పారుదలశాఖకు సంబంధించి ఎత్తిపోత పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు విద్యుత్తు అవసరం ఉంటుంది? ఏ సమయాల్లో అవసరం ఉంటుంది? తదితర అంశాల్లో ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దాదాపు చాలావరకు మేజర్ సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల మీదే ఆధారపడి ఉన్నాయి. కాళేశ్వరం, దేవాదుల, ఏఎమ్మార్పీ, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, వందల సంఖ్యలో ఐడీసీ స్కీమ్‌ల కిందే మేజర్ ఆయకట్టు ఉన్నది. ఈ ఎత్తిపోతలకు సుమారు 6 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుంది. గత ఏడాది వరకు నీటి సంవత్సరం ప్రారంభంలోనే ఆ ఏడు సీజన్‌కు సంబంధించి ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్తు అంచనాలను రూపొందించేవారు. వర్షపాతం, వాతవరణశాఖ అందించే నివేదికలను బట్టి ఏ ఎత్తిపోతల పథకానికి ఎంత విద్యుత్తు అవసరం అవుతుంది? ఏ సమయంలో విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుంది? అన్నది అంచనా వేసేవారు. వర్షపాతం సమృద్ధిగా ఉంటే విద్యుత్ డిమాండ్ 30-40, వర్షాలు సరిగా కురవని పక్షం లో 60 శాతం ఉంటుందని లెక్కలు వేసేవారు. ఇరిగేషన్ శాఖ ఈ అంచనాలను ఏప్రిల్, మేలోనే రూపొందించి ప్రభుత్వానికి, విద్యుత్తు పంపిణీ సంస్థలకు అందజేసేది. ఈ సారి మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు విద్యుత్తు అంచనాలపై దృష్టి పెట్టలేదు. అంచనాల లెక్కలు లేకపోతే రాబోయే సీజన్లో ఇబ్బందులు వస్తాయ ని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి.
‘సింగూరు’కు రూ.168.30కోట్లు
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కాల్వల సిమెంట్ కాంక్రీట్ లై నింగ్ పనులకు ప్రభుత్వం రూ.168.30 కోట్లతో పరిపాలన అనుమతులను మం జూరు చేసింది. సదాశివపేట, మునిపల్లి, చౌట్కూర్, పుల్కల్, ఆందోల్ మండలాల్లోని కాల్వలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ఆధారంగా సిద్దులకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు రూ.80.50 లక్షలు మంజూరు చేసింది. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పునరుద్ధరణకు రూ.2.23 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు పనులు చేపట్టాలని సంబంధిత చీఫ్ ఇంజినీర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

