ఈ-సైకిల్ భళా
చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్.
- 20 వేల ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన యువకుడు
- 2 గంటలు చార్జింగ్ పెడితే 30 కిలో మీటర్ల ప్రయాణం
- మల్లేశ్‌కు అభినందనల వెల్లువ
దండేపల్లి, జూన్ 4 : చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్. ఇంజినీర్లకు తానేం తక్కువ కాదని నిరూపించాడు. బ్యాటరీ సైకిల్‌తో రోడ్డుపై రయ్.. రయ్‌మని ప్రయాణిస్తూ అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాడు. గతంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. అప్పట్లోనే పలు ఆవిష్కరణలు చేశాడు. సెల్‌ఫోన్ సాయంతో ఇంటి నుంచే వ్యవసాయ మోటర్లు ఆన్.. ఆఫ్ చేయడం, చప్పట్లతో వెలిగే కరెంటు బల్బులు తయారుచేయడం లాంటివి చేశాడు. అనంతరం బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన మల్లేశ్ సెలవులకు ఇంటికి వచ్చి నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాడు.
రెండు గంటలు చార్జిచేస్తే 30 కిలోమీటర్లు..
బ్యాటరీ సాయంతో నడిచే సైకిల్ తయారు చేయాలనే ఆలోచనతో మొదట రూ.5 వేలతో సైకిల్ కొనుగోలు చేశాడు. రూ.6 వేలతో పీఎండీసీ గేర్ మోటర్ కిట్, రూ.9 వేలతో 24వోల్టుల సామర్థ్యమున్న రీచార్జబుల్ బ్యాటరీని కొనుగోలు చేశాడు. మొత్తం రూ.20 వేల ఖర్చుతో బ్యాటరీ సైకిల్‌ను తయారు చేసి ఔరా అనిపించాడు. సుమారు 2 గంటలపాటు చార్జింగ్ పెడితే 30 కిలో మీటర్లపాటు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.
దారి మధ్యలో చార్జింగ్ అయిపోయినా సైకిల్లా తొక్కుతూ గమ్యం చేరుకోవచ్చు. ఈ సైకిల్ తయారు చేయడానికి కేవలం నెల రోజులు పట్టిందని మల్లేశ్ తెలిపాడు. కొన్ని పరికరాలు ఆన్లైన్లో తెప్పించినట్టు పేర్కొన్నాడు. ప్రస్తుత ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల చుట్టూ తిరగడం వల్లే ఈ-సైకిల్ తయారు చేశానని తెలిపాడు. కాలుష్యరహిత వాహనం తయారుచేసి పర్యావరణానికి మేలు చేస్తున్న తనకు ప్రభుత్వం సాయం చేస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని చెబుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

