ముంబై, జూన్ 5: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. మూసేవాలను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే 2018లో సల్మాన్ ఖాన్ను కూడా చంపుతామని బెదిరించింది.