రూసాతో ఉన్నత విద్యకు హంగులు

హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల అభివృద్ధికి కొత్త వీసీలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. రుసా-3లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. రూసా -1, 2ల కింద రాష్ట్రంలో భారీ మొత్తంలో నిధులను వెచ్చించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా రూసా-3 కింద నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.
రూసా పథకం అమలు తీరు..
- రూసా-1లో భాగంగా రూ.176 కోట్లకు ప్రణాళికలు రూపొందించగా, కేంద్ర వాటాగా రూ.89.3 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.32.12 కోట్లను వెచ్చించారు. ఈ మొత్తాన్ని రెండు యూనివర్సిటీలు, 33 కాలేజీలు ఖర్చుచేయడమే కాకుండా, 4 మోడల్ డిగ్రీ కాలేజీలను నెలకొల్పేందుకు, మరో 3 కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు వినియోగించారు.
- రూసా- 2లో భాగంగా రూ.251 కోట్లకు ఆమోదం లభించగా, కేంద్ర వాటాగా రూ.150.6 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.24.7 కోట్లు విడుదలయ్యాయి. వీటితో 3 మోడల్ డిగ్రీ కాలేజీలు, 2 వర్సిటీలు, 5 కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చుచేయగా, 2 కాలేజీలను మోడల్ డిగ్రీగా అప్గ్రేడ్చేశారు. ఒక వర్సిటీలో రిసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు వెచ్చించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

