Gorre Ashok | అమెరికాకు తెలంగాణ ఇన్నోవేటర్ అశోక్.. సాగులో సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు
గ్రామీణ యువకుడి ఆవిష్కరణలు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. అతని ప్రతిభను గుర్తించి, మరింతగా ప్రోత్సహించేందుకు అమెరికా నుంచి ఆహ్వానం అందింది.
- అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
- వెన్నుదన్నుగా టీ వర్క్స్, టీఎస్ఐసీ
- దేశం నుంచి ఏకైక ప్రతినిధిగా అశోక్
Gorre Ashok | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): గ్రామీణ యువకుడి ఆవిష్కరణలు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. అతని ప్రతిభను గుర్తించి, మరింతగా ప్రోత్సహించేందుకు అమెరికా నుంచి ఆహ్వానం అందింది. 15 రోజులపాటు అమెరికాలోనే ఉండేలా అక్కడి ఓ విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ రంగంలో జరిగే సరికొత్త ఆవిష్కరణపై అమెరికాలోని నెబ్రస్కాలో అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ బయోలాజికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎబీఈ) సమావేశాన్ని నిర్వహిస్తున్నది. సుమారు వంద దేశాల నుంచి 7 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో మన దేశం నుంచి ఏకైక ప్రతినిధిగా తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన గొర్రె అశోక్‌కు అవకాశం దక్కింది. ఇదీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వ్యాప్తంగా ఆవిష్కరణలకు ఇస్తున్న ప్రోత్సాహం. ‘ప్రతిభ మీది. ప్రోత్సాహం మాది’ అనే నినాదంతో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ (టీఎస్ఐసీ), టీ వర్క్స్ సంస్థలు గొర్రె అశోక్‌కు అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేశాయి. టీ హబ్‌తో టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్టుగానే, సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనడమే లక్ష్యంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల యువతరానికి కొత్త దారిని చూపుతున్నాయి. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణల ప్రోత్సాహం ఫలితంగానే ఎంతోమంది వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్నారు. దాని ఫలితంగానే తెలంగాణ యువకుడికి ఆహ్వానం.
దేశం నుంచి ఒకే ఒక్కడు
అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ బయోలాజికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎబీఈ) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక అంతర్జాతీయ సమావేశానికి మన దేశం నుంచి గొర్రె అశోక్ ఒక్కడే హాజరవుతున్నారు. జూలై 9 నుంచి 12 వరకు అమెరికాలోని ఓబహాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్న అశోక్‌కు యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. జూలై 1 నుంచి 15 వరకు అమెరికాలో ఉండేందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సంతోష్ పిట్ల, ప్రకాశ్ జా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ సర్కారు ప్రోత్సాహం వల్లే
నాకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే. మా ఊళ్లో రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో పడుతున్న ఇబ్బందులను దగ్గరి నుంచి పరిశీలించాను. రైతులు సులభంగా వినియోగించే పరికరాలు తయారు చేయడం మొదలు పెట్టా. అలా ఇప్పటివరకు 8 రకాల వ్యవసాయ పరికరాలు తయారు చేశా. అందులో ప్రధానంగా విత్తనాలు నాటే పరికరం (సీడ్ సోరింగ్ టూల్), ప్యాడీ హ్యాండ్ వీడర్, ప్యాడీ డ్రమ్ సీడర్, స్ప్రేయింగ్ మెషిన్ డ్రై, వెట్‌ల్యాండ్స్, మోనో వీల్ ఇంజన్ వీడర్.. ఇలా పలు పరికరాలు తయారు చేసిన. వీటి తయారీకి టీఎస్ఐసీ, టీ వర్క్స్ ప్రోత్సహించాయి. టీ వర్క్స్‌లో ఏడాది కాలంగా ఇంటర్న్‌షిప్‌తో ఇక్కడే ఉండి పరికరాలు మార్కెట్లో విక్రయించేందుకు వీలుగా రూపొందించాను. ఇలాంటి సమయంలో అమెరికా సదస్సులో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉన్నది. – గొర్రె అశోక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

