పాతకొత్తల మేళవింపుతో జాబితా
పాతకొత్తల మేలుకయికతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించింది. పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో అతిపెద్ద వయస్కులతోపాటు పిన్న వయస్కులు, కొత్త ముఖాలు, వివిధ రంగాలకు చెందినవారికీ చోటు లభించింది.
- అతిపెద్దవయస్కుడైన అభ్యర్థిగా వనమా
- అతిపిన్న వయస్కురాలిగా లాస్య నందిత
- తొలిసారి ఎన్నికల బరిలోకి మరికొందరు
- పలువురు కొత్త వాళ్లకు చోటు
హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): పాతకొత్తల మేలుకయికతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించింది. పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో అతిపెద్ద వయస్కులతోపాటు పిన్న వయస్కులు, కొత్త ముఖాలు, వివిధ రంగాలకు చెందినవారికీ చోటు లభించింది. కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు వయసులో అతిపెద్దవారు కాగా, కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నందిత అతి పిన్న వయస్కురాలు. 1944లో జన్మించిన వనమా 1989, 1999, 2004లలో ఎమ్మెల్యేగా సేవలందించారు. 2018లో మరోమారు గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగారు. 1946లో జన్మించిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అతిపెద్ద వయస్కుడైన రెండో అభ్యర్థి.1949లో జన్మించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అబ్రహం 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 నుంచి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1986లో జన్మించిన లాస్య నందిత జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలైన అభ్యర్థి. 2016 నుంచి ఐదేండ్లపాటు జీహెచ్ఎంసీ కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. గత బల్దియా ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తన తండ్రి సాయన్న మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ స్థానం నుంచి లాస్య తొలిసారి బరిలోకి దిగుతున్నారు.
నాగార్జునసాగర్ అభ్యర్థి నోముల భగత్, తాండూరు అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి 1984లో జన్మించగా, చెన్నూరు అభ్యర్థి బాల్కసుమన్ 1983లో జన్మించారు. బాల్కసుమన్ 2014 నుంచి 2018వరకు పెద్దపల్లి నుంచి లోక్‌సభ సభ్యుడిగా, 2018నుంచి చెన్నూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రోహిత్‌రెడ్డి 2018 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నోముల భగత్ 2021లో తన తండ్రి నోముల నర్సింహయ్య మరణంతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం మొదటిసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ వైద్యవృత్తి నుంచి, జాన్సన్ రాథోడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి పోటీచేస్తున్నారు. ఖానాపూర్ నుంచి బరిలోకి దిగుతున్న జాన్సన్ కొంతకాలం అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో కొనసాగి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ములుగు అభ్యర్థి నాగజ్యోతి జిల్లా పరిషత్ చైర్మన్ కాగా, ఆదిలాబాద్ నుంచి పోటీకి దిగిన అనిల్ జాదవ్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. వీరుకూడా మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

