మెడికోలను చిదిమేస్తున్న ఒత్తిడి.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న యువ వైద్యులు
వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయడంతోపాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్న యువ వైద్యుల సంకల్పాన్ని ఒత్తిడి చిదిమేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న మెడికోల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
- రాష్ట్రంలో వరుస ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనం
- నివారణకు చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయడంతోపాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్న యువ వైద్యుల సంకల్పాన్ని ఒత్తిడి చిదిమేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న మెడికోల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని కొందరు, పీజీ సీటు రాలేదని మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నెలలు గడుస్తున్నా సెలవులు ఇవ్వడంలో జాప్యం, దీర్ఘకాలిక పనివేళలు, తీవ్రమవుతున్న పని ఒత్తిడి కారణంగా యువ వైద్యులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగిస్తున్నారు. మరో వైపు ర్యాగింగ్, వేధింపులు సైతం మెడికోల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.
మెడికోలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు.. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి తమ పిల్లలను ఉన్నత స్థానంలో నిలుపాలని కలలు కన్న తల్లిదండ్రులకు శోకాన్నే మిగుల్చుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మెడికోల ఆత్మహత్యలపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఇటీవల సీరియస్ అయ్యింది. మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలపై ప్రతినెలా సమగ్ర రిపోర్టు అందజేయాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఆదేశించిందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఘటన తర్వాత తాత్కాలిక ఉపశమనంతో సరిపెట్టకుండా.. రాష్ట్రస్థాయిలో మెడికోల ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక ఆరోగ్య సేవలు అందించాలి
రాష్ట్రంలోని ప్రతి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల్లో గోప్యతతో కూడిన మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచాలి. ఇంటర్న్, పీజీల డ్యూటీ సమయాలు, సెలవులను సమీక్షించాలి. ర్యాగింగ్, అవమానం, వేధింపులపై ఫిర్యాదుకు సమగ్ర వ్యవస్థ ఉండాలి. మెడికోలపై అధిక పనిభారం, పరీక్షల ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను సున్నితంగా పరిశీలించాలి.
-డా.విశాల్ ఆకుల, నిజామాబాద్ ప్రభుత్వ వైద్యకళాశాల
ఇటీవల జరిగిన మెడికోల ఆత్మహత్యలు
- ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు మెడికల్ పీజీ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 24న శైలజ సూసైడ్ చేసుకోగా, సోమవారం హైదరాబాద్కు చెందిన శ్రావణి ఆత్మహత్యకు చేసుకున్నది.
- పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదనే బాధతో కరీంనగర్లోని ఓ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి పునీత్వర్మ(28)సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా తాడిగడప.
- ఈ నెల 15న మెడిసిన్లో పీజీ సీటు రాలేదనే మనోవేదనతో కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన పసుల గౌతమ్(39) ఆత్మహత్య చేసుకున్నాడు. గౌతమ్ ఎంబీబీఎస్ పూర్తిచేసి నాలుగేండ్లుగా ప్రభుత్వ దవాఖానల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేశాడు. పీజీ సీటు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
- ఆగస్టులో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదివే భరద్వాజ్రెడ్డి నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- జూలైలో మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారానికి చెందిన దీక్షిత(29)బెంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతుంది. మూడు నెలలుగా సెలవులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది.
- ఏప్రిల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థి సురేశ్కట్రావత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

