‘స్త్రీనిధి’లో దిద్దుబాటు చర్యలు!
తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
- ఎండీపై పీఆర్ సెక్రటరీ సీరియస్
- వార్షిక ప్రణాళిక అమలుపై నేడు సిబ్బందితో సమీక్ష సమావేశం
హైదరాబాద్, మే 15 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఉద్యోగులందరితో సమావేశం, ఎజెండా అంశాలు వెల్లడించకపోవడంపై ఆ శాఖ సెక్రటరీ ఎండీపై సీరియస్ అయినట్టు తెలిసింది. స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు, సంస్థాగత వృద్ధి వ్యూహాలపై సమీక్షించేందుకు శనివారం ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి సిబ్బంది సమావేశం ఉన్నట్టుగా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు ప్రధాన కార్యాలయ ఉద్యోగులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. సమావేశానికి మంత్రి సీతక్కతోపాటు ఆశాఖ సెక్రటరీ, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ హాజరవుతున్నట్టు తెలిసింది. గ్రామీణ, ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా, 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళికను అమలుచేయడం ఈ సమావేశం ప్రాథమిక ఉద్దేశమని, దీనిపై సిబ్బంది వినూత్న ఆలోచనలు, సూచనలు ఇవ్వాలని పైకి చెప్తున్నా.. సమావేశం అసలు ఎజెండా వేరే ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు స్త్రీనిధిలో జరిగే అక్రమాలపై శనివారం ప్రజాభవన్ సమీపంలో ఉస్మానియా వర్సిటీకి చెందిన నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ప్రెస్‌మీట్ పెట్టనున్నట్టు ప్రకటించింది. స్త్రీనిధిలో అవినీతి ఆరోపణలు ఎదురొంటూనే, 14 ఏండ్లుగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఎండీ విద్యాసాగర్రెడ్డిపై ఎంక్వయిరీ, జీవో-523 కింద చర్యలు తీసుకోకుండా మళ్లీ ఉద్యోగ కాలం పొడిగించే ప్రక్రియ నడుస్తున్నదని, ఇటీవలి ఉద్యోగ నోటిఫికేషన్లలో రోస్టర్ విధానం, రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారానే నియామకాలు చేపట్టడం, 30 ఏండ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వంటి అంశాలపై ఆధారాలుసహా వివరిస్తామని జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

