లోకేశ్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించాలి
తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
- బనకచర్లను అడ్డుకుంటాం
- తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది కేసీఆరే
- మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
మోర్తాడ్, ఆగస్టు 1: తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఎలాగైనా కట్టి తీరుతామంటున్న లోకేశ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో అసలు లోగుట్టు బయటపడిందని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం, చంద్రబాబు పథకం ప్రకారం ముందుకు తీసుకువెళ్తున్నట్టు లోకేశ్ వాఖ్యలతో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు కలిసి చేసే ఈ నాటకంలో రేవంత్‌రెడ్డిని పావులా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు, లోకేశ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ప్రభుత్వం, బీజేపీ నాయకుల చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు.
బనకచర్ల మీద చర్చ కోసం ఢిల్లీకి పోనని పగలు చెప్పిన రేవంత్‌రెడ్డి రాత్రికి రాత్రి మనసు మార్చుకుని ఢిల్లీకి వెళ్లి బనకచర్ల మీద వేసిన కమిటీని ఒప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ‘బనకచర్ల ఎజెండాలో లేదు.. కడుతం అంటే కదా అడ్డు చెప్పేది అన్న రేవంత్‌రెడ్డి.. మరీ ఇప్పుడు లోకేశ్ మాట్లాడిన మాటలపై నీ నోరు ఎందుకు పెగలడం లేదు’ అని సీఎంను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు మెప్పుకోసం, అలాగే కేంద్రం దగ్గర తన స్వప్రయోజనాల కోసం తెలంగాణను తాకట్టు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డి జుట్టు చంద్రబాబు, బీజేపీ చేతిలో ఉన్నదని ఎద్దేవా చేశారు.
అందుకే తనను తాను కాపాడుకోవడానికి బనకచర్ల విషయంలో చంద్రబాబు, బీజేపీకి వత్తాసు పలుకుతూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని, పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టు కట్టడాన్ని అడ్డుకుంటామని స్పష్టంచేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ముగ్గురు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు, యువతకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

