సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సాగర్ ఉప ఎన్నిక | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.

నల్లగొండ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం ఉదయం కౌటింగ్ రిహార్సల్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్ చవాన్, ఆర్ ఓ రోహిత్ సింగ్ లు ఏర్పాట్లను, రిహార్సల్స్ ను పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాల ఉండగా 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ లో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగనుంది. మొత్తం రెండు హాల్స్ ను ఏర్పాటు చేసి ఒక్కో హాల్ లో ఏడు కౌంటింగ్ టేబుల్స్ చేంజ్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌటింగ్ ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను ఓపెన్ చేసి లెక్కింపు చేపడతామని, దీంతో పాటే ఈవీఎంల లెక్కింపు కూడా మొదలు పెడతామని స్పష్టం చేశారు. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
కౌంటింగ్ హాల్లోకి, దాని ఆవరణలోకి రావాలంటే కచ్చితంగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
అందుకోసం శనివారం అధికారులకు, కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లకు, మీడియా, పోలీసు ప్రతినిధులకు కౌటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వెంటనే రిపోర్ట్ అందజేశారు. రేపు ఉదయం ఈ రిపోర్ట్ చూపిస్తేనే కౌటింగ్ హాల్ లోకి అనుమతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

