రిజిస్ట్రేషన్లు రెట్టింపు
- రోజుకు 3 వేల లావాదేవీలతో దూసుకెళ్తున్న ధరణి
- ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.374 కోట్లు
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): భూ రిజిస్ట్రేషన్లలో ధరణి పోర్టల్ దూసుకుపోతున్నది. రోజుకు సగటున 3 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ధరణి లావాదేవీలు ప్రారంభమైన నవంబర్ నెలతో పోల్చితే ఫిబ్రవరిలో రెట్టింపునకు చేరాయి. పోర్టల్ ఆధారంగా సేవలు అత్యంత సులభంగా, పారదర్శకంగా, వేగంగా జరుగుతుండటంతోపాటు ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. ధరణి ప్రారంభమైన మొదటి నెల లో 36,710 రిజిస్ట్రేషన్లు కాగా, 36,920 స్లాట్లు బుక్ అయ్యా యి. ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు 71,402కాగా, స్లాట్లు 75,327 బుక్ అయ్యాయి. మంగళ, శనివారాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో 3 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 3.38 లక్షల లావాదేవీలు జరుగగా. రూ.374 కోట్ల ఆదా యం సమకూరిందని అధికారులు తెలిపారు.
ప్రధాన సమస్యలకు మోక్షం
తాజాగా ప్రవేశపెట్టిన ‘గ్రీవెన్స్ మాడ్యూ ల్’, ఇతర గ్రీవెన్స్ ఆప్షన్లతో 60 నుంచి 70 భూ సమస్యలకు చెక్ పడుతున్నదని అధికారులు చెప్తున్నారు. గ్రీవెన్స్ మాడ్యూల్తో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు, సర్వే నంబర్ మిస్సింగ్, విస్తీర్ణం నమోదులో పొరపాట్లు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. దీంతోపాటు దరఖాస్తు స్థితి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?, ఒకవేళ ఆమోదిస్తే భూ యజమాని ఎవరిని సంప్రదించాలి? వంటి వివరాలన్నీ దరఖాస్తుదారు మొబైల్ నంబర్‌కు అప్‌డేట్లురానున్నాయి.
నవంబర్ నుంచి ధరణి రిజిస్ట్రేషన్లు
నెల రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్
నవంబర్ 36,710 36,920
డిసెంబర్ 37,736 39,248
జనవరి 51,238 53,407
ఫిబ్రవరి 71,402 75,327
మార్చి (15 నాటికి) 31,484 34,799
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

