Registrations halt | తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు.. రెండు రోజులుగా పనిచేయని సర్వర్లు..!
Registrations halt | తెలంగాణవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించిపోయాయి. సాంకేతిక లోపాలతో ప్రధాన సర్వర్లు గత రెండు రోజులుగా పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Registrations halt : తెలంగాణవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించిపోయాయి. సాంకేతిక లోపాలతో ప్రధాన సర్వర్లు గత రెండు రోజులుగా పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో కొత్త స్లాట్ బుకింగ్‌లు, చలాన్ చెల్లింపులు, ఈ-కేవైసీ వంటి ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
ముందుగానే ముహూర్తాలు చూసుకుని స్లాట్లు బుక్ చేసుకున్న క్రయ, విక్రయదారులు సాక్షులతో కలిసి కార్యాలయాలకు చేరుకున్నా, గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడు నెలల్లో సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సాంకేతిక లోపం ఎక్కడ తలెత్తిందనే విషయంపై క్షేత్రస్థాయి అధికారులకు కూడా సమాచారం లేదు. దాంతో వారు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దాంతో కార్యాలయాల వద్ద గందరగోళం నెలకొంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి సర్వర్లను పునరుద్ధరించేందుకు రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం చర్యలు చేపట్టిందని ఉన్నతాధికారులు తెలిపారు. సేవలు ఎప్పటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

