తల్లీబిడ్డలకు ఆరోగ్యమస్తు

- ఆరేండ్లుగా ఆగని పోషకాహార పంపిణీ
- తగ్గిన ప్రసూతి, శిశు మరణాల రేటు
- నిరంతరాయంగా ఆరోగ్యలక్ష్మి
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): పురిటి మరణాలను నిర్మూలించేందుకు, బాల్యం నుంచి పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యలక్ష్మి పథకానికి ఆరేండ్లు పూర్తయ్యాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిరోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జనవరి 1, 2015న ప్రారంభించింది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలు 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. ఈ పథకం ప్రసూతి మరణాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచింది. ఆరోగ్యలక్ష్మికి ముందు 2013-14లో ప్రసూతి మరణాలు లక్ష మందికి 92 ఉంటే 2020 నాటికి అవి 63కు తగ్గాయి. శిశు మరణాల రేటు కూడా 39 నుంచి 26కు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పథకం గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని తల్లీబిడ్డలకు లబ్ధిని చేకూరుస్తున్నదని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కరోనా సమయంలోనూ..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు బాలామృతం, బాలామృతం ప్లస్‌ను టీఎస్ఫుడ్స్ ద్వారా (ఆర్టీసీ కార్గో సేవల) సరఫరా చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా నిరాటంకంగా ఈ పథకాన్ని కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మినీ అంగన్వాడీ వర్కర్ జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం ఇందుకు నిదర్శనం
పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం:
ఏడు నెలల నుంచి మూడేండ్ల లోపు పిల్లలకు నెలకు 16 కోడిగుడ్లు అందిస్తున్నారు. గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు.
మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు రోజుకు ఒక గుడ్డు చొప్పున అందిస్తున్నారు. గుడ్లతోపాటు ప్రతిరోజు పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ఇస్తున్నారు.
గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం
గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. గుడ్డుతోపాటు కనీసం 25 రోజుల పాటు సంపూర్ణ భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నారు.
ప్రస్తుత లబ్ధిదారులు: రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యలక్ష్మి ద్వారా 20.30 లక్షల పైచిలుకు లబ్ధిదారులు పౌష్టికాహారం అందుకుంటున్నారు.
7 నెలల నుంచి మూడేండ్ల లోపు వారు 10,27,954
మూడు నుంచి ఆరేండ్లలోపువారు 5,88,657
గర్భిణీలు, బాలింతలు4,13,535 మొత్తం: 20,30,146
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

